హనుమకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈనెల 26న జరుగు గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అదనపు కలెక్టర్ నెమరుగముల రవి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ అధికారులతో ఏర్పాటలను సమీక్షించి దిశ నిర్దేశం చేశారు.