MDCL: ప్యారడైజ్ నుంచి శామీర్ పేట వరకు నిర్మించనున్న సెకండ్ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించిన టెండర్ ఖరారైనట్లు HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కారిడార్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ఉత్తర హైదరాబాద్‌కు అనుసంధానం మరింత మెరుగవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.