TG: ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నిరంకుశత్వమే కాంగ్రెస్ పాలసీనా అని నిలదీశారు. శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.