GNTR: వైసీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సంస్థాగత కమిటీ నిర్మాణంపై నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ హాజరయ్యారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి దశ–దిశలను నాయకులకు సూచించారు.