BDK: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో శనివారం భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం వేడుక ఘనంగా జరిగింది. తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకువచ్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ కంకణ ధారణతో నిత్య కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తుల సందడి మధ్య నిత్య కళ్యాణం నిర్వహించారు.