NZB: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ద్వారక నగర్ ప్రాంతంలో ఒకరోజు ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెత్త కుప్పలో పారేశారు. గుర్తించిన స్థానికులు వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని శిశువును చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు.