GNTR: గుంటూరు నగరపాలక సంస్థ (GMC) నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మయూర్ అశోక్‌ను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులపై ఉన్న క్రమశిక్షణ చర్యలను ఎత్తివేయాలని, అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను త్వరితగతిన కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.