AP: కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతి అంకితభావం నెటిజన్ల మనసు గెలుచుకుంది. డ్యూటీ ముగించుకుని వెళ్తుండగా.. ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో రంగంలోకి దిగింది. తన చంటి బిడ్డను ఎత్తుకుని మరీ స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేసింది. ఆమె చేసిన ఈ పనికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.