చలికాలంలో వాతావరణ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఈ సమయంలో చల్లటి నీరు తాగితే శరీరం లోపల ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు రావచ్చు. దీంతో జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం లోపలి ఉష్ణోగ్రత సమతుల్యంలో ఉంటుంది. గోరువెచ్చని నీరు శరీరాన్ని చలికి అలవాటు పడేలా చేస్తుంది. జలుబు, గొంతు సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది.