NGKL: తిమ్మాజీపేట మండలం గోరిట గ్రామానికి చెందిన రవి గ్రూప్-3 ఫలితాల్లో ఘన విజయం సాధించారు. భారత సైన్యంలో సేవలు అందించి పదవీ విరమణ చేసిన ఆయన, పట్టుదలతో చదివి ఆర్థిక శాఖలో అసిస్టెంట్ ఆడిటర్‌గా ఉద్యోగం దక్కించుకున్నారు. దేశ సేవ నుంచి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సేవలోకి అడుగుపెడుతున్న రవిని గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.