VSP: ఎంవీపీలో నివసిస్తున్న రమా హిమజ (27) గత ఏడాది నవంబర్లో వివాహం చేసుకున్నారు. పండుగ సందర్భంగా నూతన వధూవరులు విశాఖ అత్తారింటికి వచ్చారు. శుక్రవారం అన్నవరం వెళ్లి తిరిగి వస్తుండగా.. ఎన్ఏడీ జంక్షన్ వద్ద కారు టైరు పేలడం వల్ల డివైడర్ను ఢీకొట్టి ఆమె అపస్మారక స్థితిలో పడిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతి చెందింది.