BDK: సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణాల నుంచి పల్లెలకు వచ్చిన ప్రజలు పండుగ తర్వాత తిరుగు బాట పట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం మణుగూరు సురక్ష బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో బస్టాండ్లో జేబు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ సిబ్బంది పలు సూచనలు చేశారు. ప్రయాణికులు తమ వస్తువు పట్ల జాగ్రత్త వహించాలన్నారు.