MDK: శివంపేట మండలం సికింద్లాపూర్ స్వయంబు వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి ఉగాది వరకు మూడు నెలలపాటు జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతి ఆదివారం జాతర ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో వచ్చి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.