HNK: కమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి -రవీందర్ మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనదేవతల గద్దెల ఆధునీకరణ, భక్తుల సౌకర్యాల కోసం రూ.250 కోట్లు కేటాయించి చరిత్ర సృష్టించారని కొనియాడారు.