‘యుఫోరియా’ ప్రతి కుటుంబంలో ఒకరికి కనెక్ట్ అవుతుందని దర్శకుడు గుణశేఖర్ అన్నాడు. అంతేకాదు సారా అర్జున్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘కథ వింటున్నప్పుడే సారా అయితే బాగుంటుందని నిర్మాత చెప్పింది. ఆమె నటిస్తేనే ఈ మూవీ తీయాలనుకున్నాం. లేదంటే ఆపేద్దాం అని ఆమెతో చెప్పా. ఈ మూవీ చూశాక మీకే అర్థమవుతుంది. అంత గొప్పగా నటించింది. చిన్నమ్మాయే అయిన ఉన్నతంగా ఆలోచిస్తుంది’ అని తెలిపాడు.