GNTR: మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా జిల్లాలో ‘శక్తి’ బృందాలు పనిచేస్తున్నాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 8 ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాయి. గత మూడు నెలల్లో 99 కార్యక్రమాల ద్వారా 2 వేల మందికి అవగాహన కల్పించారు. 821 మందితో ‘శక్తి’ యాప్ ఇన్స్టాల్ చేయించారు. ఈవ్ టీజింగ్‌ను అరికట్టడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు.