VZM: బొండపల్లి మండల కేంద్రం జంక్షన్ వద్ద సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ పై బొండపల్లి ఎస్సై యు.మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు జాతీయ రహదారిపై ప్లకార్డుల ప్రదర్శన జరిపారు. శనివారం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అతివేగం పనికిరాదన్నారు.