MBNR: పట్టణంలో అభివృద్ధి పనులు నాణ్యతతో నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని మెప్మా కార్యాలయంలో 25 లక్షల ముడా నిధులతో నూతన షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ జనరల్ సెక్రెటరీ సిరాజ్ ఖాద్రి పాల్గొన్నారు.