నంద్యాల పట్టణంలోని క్రాంతి నగర్ సమీపంలో స్లమ్ ఏరియాలో మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు. శనివారం ASP జావలి ఆదేశాల మేరకు శక్తి టీం సభ్యులు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, తదితరులు 112పై వివరించారు. బాల్య వివాహాలు చేయరాదని, కొత్త వ్యక్తులు ఇచ్చే తినుబండారాలు తినరాదని సూచించారు. బయటకు వెళ్లే సమయంలో ఇంటి వద్ద పిల్లలకు కాపలాగా ఒకరిని ఉంచాలన్నారు.