VZM: మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే యూనిఫాంలు పంపిణీ చేయాలని CITU జిల్లా ఉపాధ్యక్షుడు పి.శంకరరావు డిమాండ్ చేశారు. శనివారం బొబ్బిలిలో ఆయన మాట్లాడారు. పర్మినెంట్ కార్మికులకు ఇచ్చి కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వకపోవడం అన్యాయమని ఆరోపించారు. అధికారులు స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.