మంచిర్యాల జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గంను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహారించిన బీ. వేణుగోపాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా బీ. కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా కమలరాజ్, ప్రధాన కార్యదర్శిగా యు. వెంకటేష్, కోశాధికారిగా సందీప్ కుమార్ ఎన్నికయ్యారు. యువ క్రీడాకారుల ప్రతిభ ప్రోత్సహంచడం లక్షంగా ఎన్నిక జరిగిందన్నారు.