జగిత్యాల మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేశారు. వర్షాకాలం, శీతాకాలం మారే సమయంలో పశువులకు సోకే ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధిని అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ సుమలత మల్లేష్, ఉప సర్పంచ్ ప్రేమ్నాద్ సిబ్బంది పాల్గొన్నారు.