సత్యసాయి: సోమందేపల్లి మండలం సుద్దగుంటపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. వెంటర్నరీ వైద్య సిబ్బంది రైతులకు పశువుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ వెంకటరమణ, మండల కన్వీనర్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.