నటి హన్సిక తన వివాహ బంధానికి స్వస్తి పలికింది. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ‘చార్దీ కలా’ పంజాబీ పోస్ట్ వైరల్ అవుతోంది. ఎప్పుడూ ఉత్సాహంతో ముందుకుసాగాలని, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశను కోల్పోవద్దని ఈ పదం అర్థం.