TG: KCRకు CM రేవంత్ సవాల్ విసిరారు. ‘మీరు మంజూరు చేసిన ప్రాజెక్ట్ కానీ, పూర్తి చేసిన ప్రాజెక్ట్ కానీ ఒక్కటైనా మహబూబ్ నగర్ జిల్లాలో ఉందా? వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఉద్ధండాపూర్ రైతులకు పరిహారం ఇచ్చి భూసేకరణ చేశారా? సంగంబండ బండ పగలకొట్టేందుకు రూ.10 కోట్లు కూడా ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డిని గతంలో కాంగ్రెస్ నేతలే సాధించారు’ అని పేర్కొన్నారు.