NRML: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని మొత్తం 42 వార్డుల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. 50 శాతం వార్డులను మహిళలకు కేటాయిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విభాగాల వారీగా జాబితాను విడుదల చేశారు. రిజర్వేషన్లు తేలడంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.