KNR: కేంద్ర ప్రభుత్వఅనుచిత విధానాలపై ఉద్యమించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి యువజన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం ఎల్ఎండీ కాలనీలోని అరుంధతీ ఫంక్షన్ హాల్లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అట్ల అనిల్ అధ్యక్షతన జరిగిన యూత్ కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.