TG: మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో 2014లోనే వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. అక్కడ భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు గొప్పలు చెబుతున్న వాళ్లు.. నాడు కేసీఆర్ దగ్గరికి వెళ్లి పాలమూరు ప్రాజెక్ట్ గురించి అడిగారా? అని నిలదీశారు. వాళ్ల చేతిగానితనంతో తమపై చెత్త ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.