నల్గొండ పట్టణంలో రూ.2.5 కోట్ల వ్యయంతో రాజీవ్ పార్క్ & మామిల్లగూడెం పార్కు అభివృద్ధి పనులకు మంత్రి వెంకట్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా పట్టణ ప్రజలకు పచ్చదనంతో పాటు ప్రశాంత వాతావరణం అందుబాటులోకి రానున్నదన్నారు. ప్రజలకు అనుకూలంగా పట్టణాన్ని తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి అన్నారు.