GNTR: ఫిరంగిపురం సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాతులూరుకు చెందిన ఉమామహేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఆయనను ఢీకొట్టింది. ఉమామహేశ్వరరావుకు తలకు తీవ్ర గాయాలవ్వడంతో, స్థానికులు 108కి సమాచారం అందించారు. మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.