కర్నూలులో కొత్తపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి సచివాలయంలో నిర్వహిస్తున్న వ్యాధినిరోధక టీకాలు, సంచార చికిత్స కార్యక్రమాన్ని నోడల్ అధికారి డాక్టర్ రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాతా, శిశు ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. గర్భిణులను సకాలంలో పర్యవేక్షించాలని, నమోదు సమయంలో మాతా, శిశు సంరక్షణ కార్డును పూర్తిగా నింపాలన్నారు.