AKP: కోటవురట్ల మండలం రాజుపేట గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితునికి పూర్వ విద్యార్థులు చేయూతనందించారు. కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో 2003-2004లో పదవ తరగతి చదువుకున్న ఆడారి శ్రీను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు రూ.27,000 సమకుర్చి శనివారం గ్రామానికి వెళ్లి శ్రీనుకు అందజేశారు.