U19 వన్డే ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం భారత్ 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్ 51 పరుగులు, అభిజ్ఞాన్ కుందు 2 పరుగులతో ఉన్నారు.