KMR: జుక్కల్ మండల కేంద్రంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో పలువురు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రభుత్వం, నిర్వహణ కమిటీ తరపున “అప్రిషియేషన్ సర్టిఫికేట్” అందజేసి వారిని ప్రత్యేకంగా అభినందించారు.