ఇష్టమైన ఆహారం ఎక్కువగా తినడం, వ్యాయాయం చేయకపోవడం, పీచు ఉండే ఆహారాన్ని తక్కువ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. అందుకే పీచు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినాలి. పెరుగు, మజ్జిగ, తృణధాన్యాలు, పండ్లు, కాయగూరలు, నట్స్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. గబగబా భోజనం చేయకుండా నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి. నిద్ర సరిగ్గా పోవాలి.