కృష్ణా: పిన్నెల్లి గ్రామంలో దళిత యువకుడు మందా సాల్మన్‌ను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటనను ఖండిస్తూ, వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో గుడివాడలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాగవరప్పాడు లోని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైసీపీ నాయకులు నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో దుక్కిపాటి శశి భూషణ్,మట్ట జాన్ విక్టర్ పాల్గొన్నారు.