దానిమ్మ పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. శరీరంలోని దీర్ఘకాలిక వాపులను తగ్గిస్తాయి. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతాయి. కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.