యష్ ‘టాక్సిక్’ టీజర్ వివాదంపై సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు. దీనిపై తాను ఎలాంటి స్పష్టత ఇవ్వలేనని అన్నారు. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో చూసే ఎన్నో వీడియోలకు సెన్సార్ సర్టిఫికెట్ ఉండదని, అవి తమ పరిధిలోకి రావని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. OTT కంటెంట్ కూడా తమ దగ్గరికి రావని, వాటికి ధ్రువీకరణ ఉండవని అన్నారు.