KRNL: జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు బీ. క్యాంప్‌కు చెందిన శ్రీహిత ఎంపికైనట్లు శిక్షకులు పాలు విజయకుమార్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 21 నుంచి 28 వరకు మణిపూర్‌లో జరిగే అండర్–19 ఎస్జీఎఫ్ఎ జాతీయ పోటీల్లో ఆమె పాల్గొంటుంది. గత అక్టోబర్‌లో ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ఎ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు వారు వెల్లడించారు.