ADB: దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి సాధించిన భారీ విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు నిర్వహించి, టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.