NRML: బాసర రైల్వే స్టేషన్ నుంచి నవీపేట్ మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకలను 17వ తేదీ నుంచి 23 వరకు రద్దు చేశారు. కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు డివై దిలీప్ కుమార్ బుధవారం తెలిపారు. 11409/11410, 11413/11414, 17687/17688 రైళ్లు పాక్షికంగా రద్దు అయ్యాయని పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.