VZM: జిల్లా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి దంపతులు స్థానిక కే.ఎల్. పురంలో ఉన్న స్త్రీ శిశు సంక్షేమ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమంను బుధవారం సందర్శించి, అక్కడ చిన్నారులతో కలిసి భోగి పండుగను జరుపుకొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ దంపతులు చిన్నారులకు భోగి పళ్ళు పోసి చిన్నారులను ఆశీర్వదించారు. ఆనంతరం ఆశ్రమ నిర్వహణ పిల్లల ఆరోగ్యంపై ఆరా తీశారు.