అన్నమయ్య: ఆర్టీసీ 1, 2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆఫ్ శ్రీను) సంక్రాంతి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంక్రాంతి ప్రతీక అని పేర్కొన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలను ప్రజలు ఘనంగా జరుపుకుంటారని, పల్లెల్లో పండుగ శోభ వెల్లివిరుస్తుందన్నారు.