JGL: కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఫార్మర్ ఐడీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇబ్రహీంపట్నం మండల వ్యవసాయ అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన రైతులే ప్రభుత్వ పథకాలకు అర్హులని స్పష్టం చేశారు.