NRML: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును బుధవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ సభ్యులు కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిరుపేద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.