ASF: కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం ఎమ్మెల్యే హరీష్ బాబును NPDCL అధికారులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూల బొకే అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కరెంటు లైన్ షిఫ్టింగ్, ఎక్స్టెన్షన్ పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో SE, AEలు పాల్గొన్నారు.