NGKL: ఊర్కొండ మండలాన్ని కల్వకుర్తిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తంగా మారింది. అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నేతలు నిరంజన్ గౌడ్, సదానందం గౌడ్ మాట్లాడుతూ.. అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.