VZM: పెద్ద పండగ సంక్రాంతికి స్వాగతం పలుకుతూ భోగభాగ్యములను అందజేసే భోగి వేడుకలను జనసేన నాయకులు అవనాపు విక్రమ్ స్వగృహం వద్ద వైభవంగా నిర్వహించారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలసి అవనాపు విక్రమ్ సంప్రదాయానుసారం భోగి మంటను వెలిగించారు. ప్రజలంతా భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలని ఈ సందర్బంగా అవనాపు విక్రమ్, భావన అన్నారు.