MLG: లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. మంగపేట మండలం మల్లూరు గ్రామంలో గల హిమాచల లక్ష్మీనరసింహస్వామిని ఇవాళ మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు,అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.