NDL: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పగిడ్యాల మండలం ప్రాతకోటలో ఎద్దుల బండ లాగుడు పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర ముఖ్య అతిథిగా హాజరై కాశీవిశ్వనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్ద బండకు పూజ నిర్వహించి ఎద్దుల బండ లాగుడు పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో మొత్తం 12 ఎడ్ల జతలు పాల్గొన్నాయి.